| Home >> Tirupati News >> శ్రీవారి స్వర్ణరథంపై గొడుగు చోరీ, విచారణకు ఆదేశం |
Posted on 06 Jan ,2011
తిరుపతిలో శ్రీవారి స్వర్ణరథంపై గొడుగును కొందరు దుండగులు అపహరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. చోరీకి గురైన గొడుగు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. గొడుగ చోరీ ఘటనపై కేసు నమోదు చేయాలని అధికారులను టీటీడీ జేఈవో భాస్కర్ ఆదేశించారు.
ఈ స్వర్ణ రథాన్ని శ్రీవారి ముందున్న వాహనమండపంలో సిబ్బంది భద్రపరిచారు. ఈ మండపం ఇనుప రేకులతో నిర్మితమై ఉండటంతో దక్షిణవైపు ఉన్న ఓ రేకును తొలగించిన దుండగులు లోనికి ప్రవేశించి స్వర్ణగొడుగును అపహరించారు. విశేష పర్వదినాల్లో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఈ స్వర్ణ రథంపై తిరుమల వీధుల్లో ఊరేగుతారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోనికి వచ్చింది.