User Name:

Password:

Forgot Password?

New User Register

Search Hotels





Adults Children


 
 
Home >> Tirupati News >> సంతోషంగా ఉంది, ప్రజలకు మేలు చేయాలి: కిరణ్ తల్లి సరోజమ్మ

Tirupathi newsBack

సంతోషంగా ఉంది, ప్రజలకు మేల

Posted on 25 Nov ,2010

Tirupati:తన కుమారుడు ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం తనకు సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ రెడ్డి తల్లి సరోజమ్మ అన్నారు. ప్రజలకు మేలు చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఆమె గురువారం ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు. కుమారుడి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పలకరించినప్పుడు ఆమె ఆ విధంగా వ్యాఖ్యానించారు.

కాగా, కిరణ్ కుమార్ కు సందర్శకుల దాడి పెరిగింది. కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. యువకుడు, బాగా పనిచేస్తాడని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కష్టపడి పనిచేసేవారికి మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ తరఫున తాను శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

 
back to top